Tuesday 5 January 2021

విద్యార్థుల ఎత్తు కొలతల నమోదు - మార్గదర్శకాలు మరియు నమోదు లింకు

 విద్యార్థుల ఎత్తు కొలతల నమోదు - మార్గదర్శకాలు మరియు నమోదు లింకు





 💯 విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను పిలిచి ఆయా క్లాస్‌ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి.


🔆 ప్రస్తుత కోవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ పనిని పూర్తి చేయాలి.


🔔 సూచనలు :

మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్‌ చేసిపెట్టుకోవాలి.

☑ ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి. 

☑ పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.

☑  ఒక  తరగతి  పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్‌ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్‌ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.

☑ వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.

☑  పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్‌ లో ఇచ్చిన లింక్‌ లో ఖచ్చితంగా నమోదు చేయాలి.

🔔  విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు విధానం :

❖ కింది లింక్ ద్వారా చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడి ,పాస్వర్డ్ ను ఉపయోగించి.. ప్రధానోపాధ్యాయులు లాగిన్ కావలెను.

❖ తదనంతరం SERVICE ను ఎంచుకొని UPDATE STUDENT HEIGHT DETAIL Form ను CLICK చేయాలి.

❖ తదుపరి వచ్చు UPDATE STUDENT HEIGHT Details Form ( Box) నందు విద్యార్థి  ఐ.డీ నెంబర్ నమోదు చేయాలి.

❖తరువాత ..

🕀 SCHOOL  CODE.

🕀 STUDENT ID.

🕀 STUDING CLASS.

🕀 STUDENT NAME.

🕀 GENDER.

🕀 STUDENT AADHAAR NO.

🕀 MOTHER/GUARDIAN NAME.

🕀 SELECT STUDENT HEIGHT..

❖ మొదలగు వివరాలతో కూడిన FORM ఓపెన్ అవుతుంది.

❖ ఈ వివరాల చివర ఉన్న SELECT STUDENT HEIGHT.. ఆప్షన్ను తాకితే 50 నుండి 185 సెంటీమీటర్ల వరకు కొలతలు అగుపిస్తాయి.

❖ ఇందులో విద్యార్థి యొక్క సరైన కొలతను ఎంచుకొని  SUBMIT DATA పై CLICK చేయవలెను.

❖ దీనితో ఒక విద్యార్థి యొక్క ఎత్తు కొలత విజయవంతంగా నమోదవుతుంది.

❖ ఈ విధానాన్ని ప్రతి విద్యార్థికి అనుసరిస్తూ పోవాలి.



CLICK HERE TO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top