Saturday 14 November 2020

ఉపాధ్యాయ బదిలీలు - 2020 : : సందేహాలు - సమాధానాలు

 ఉపాధ్యాయ బదిలీలు - 2020 : : సందేహాలు - సమాధానాలు




టీచర్ల / హెచ్.యం ల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.11.20 నుండి మొదలైనప్పటి నుంచి ఉపాధ్యాయులకు కలిగిన కొన్ని సందేహాలపై జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) శ్రీ. డి.దేవానంద రెడ్డి గారు నివృత్తి చేశారు. 

అవి....

1) సందేహం :  2018 డీఎస్సీ ద్వారా నియామకం కాబడిన వారికి ట్రెజరీ ఐడి లేనందున వారి స్పోజ్ లకు దరఖాస్తుకు వీలులేకుండా వున్నది.

 సమాధానం :  డైరెక్టరేట్ నుండి DEO ఆఫీసులకు రాండమ్ గా నెంబర్స్ కేటాయించడం జరిగింది. తాత్కాలిక ట్రెజరీ  ఐ.డి ని క్రియేట్ చేస్తారు. ఆ సమస్య గల వారు ఆయా DEO కార్యాలయాల్లో సంప్రదించాలి.


2) సందేహం : కనీస అర్హత రెండేళ్ల సర్వీస్ లేకపోయినా ఆన్లైన్ దరఖాస్తు సబ్మిట్ కాబడుతుంది.

 సమాధానం :  అటువంటి దరఖాస్తుకు అవకాశం లేకుండా సరిచేశాము. ఐతే రి అప్పోర్షన్ (రేషనలైజేషన్) కు గురైన మిగులు టీచర్స్ అయా పాఠశాలల్లో రెండు సం.ల లోపు వున్నను వారి దరఖాస్తు సబ్మిట్ కు అవకాశం కల్పించబడింది.

3) సందేహం : 

i) గత సం.లలో కేటగిరి 1V, III లలో మార్పులు, 

ii) రేషనలైజేషన్ లో మిగులుగా తేలిన వారికి జి. వో ప్రకారం పూర్వపు పాయింట్స్ కేటాయింపు, 

iii) DEO పూల్ లో వుండే టీచర్ల సర్దుబాటు మరియు 

iv) ట్రాన్స్ఫర్ మెసేజ్ రానివారికి తగు పరిష్కారాలపై కోరగా....

 సమాధానం :  పై నాలుగు అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని అందరూ DEO లకు మార్పులు - చేర్పులు - సర్దుబాటు - దోషాలను సరిచేయుటకు తగు అధికారం (సౌకర్యం ) కల్పించామన్నారు. ఈలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే వారు ఆయా జిల్లాల్లో *DEO ఆఫీస్ ట్రాన్స్ఫర్ సెల్ సిబ్బందిని* సంప్రదించాలని స్పష్టం చేశారు.


4) సందేహం :  దరఖాస్తులో Widow కాలమును చేర్చాలి.

సమాధానం : ప్రిఫరెన్సియల్ కేటగిరీలో  Widow కాలమ్ ను చేర్చడం జరిగింది. అప్లికేషన్ లో అవసరం లేదని తెల్పారు.

2 comments:

  1. A అనే టీచర్ బార్య B ఇద్దరూ ఇపుడు X అనే మండలం లో పనిచేస్తున్నారు.
    A కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం ఉంది. B కు కంపల్సరీ లేదు ఇద్దరి లో B కి spouse apply చేస్తే B కి placement X మండలం దగ్గర్లో ఇస్తారా???
    లేదా A transfer అయిన మండలం దగ్గర్లో ఇస్తారా???

    Plz చెప్పగలరు...

    ReplyDelete
  2. Spouse catageory లో ఆవిడకి 35 పాయింట్స్,అతనికి 24 పాయింట్స్ వచ్చాయి ఇద్దరు ట్రాన్స్ఫర్ కి అప్లై చేశారు,ఎవరి ప్లేస్ లో కి ఎవరు వెళ్తారు,

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top