Tuesday, 6 October 2020

మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు : కేంద్ర విద్యాశాఖ షరతులు

 మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు : కేంద్ర విద్యాశాఖ షరతులు





Mid Day Meal Workers : 

◾ పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

◾ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.

◾ గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ తెలిపారు.

మార్గదర్శకాలివే : 

◾ మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.

◾ పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.

◾ పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.

◾ మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

◾ నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.

◾ వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.

◾ ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.

◾ మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.

◾ కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.

◾ అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.

◾ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.

◾ భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top