Thursday 29 October 2020

ఈ ఏడాదికి నిర్వహించాల్సిన పరీక్షల వివరాలు - మరింత సమాచారం

 ఈ ఏడాదికి నిర్వహించాల్సిన పరీక్షల వివరాలు - మరింత సమాచారం





🔆 పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. పాఠ్యాంశాలను మూడు విభాగాలుగా విభజించింది. వాటిని తరగతి గదిలో బోధించేవి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు చదువుకునేవి, విద్యార్థులే ఇంటి వద్ద చదువుకునేవిగా వర్గీకరించింది. తప్పనిసరి పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తారు.

🔆 కొన్ని పాఠ్యాంశాలను వాట్సప్‌ లేదా తరగతికి వచ్చిన సమయంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది. అభ్యాసన ప్రక్రియలో భాగంగా వర్క్‌బుక్స్‌ వంటివి ఉంటాయి. ఈ విధానంలో పాఠ్యాంశాల బోధన 30-50% వరకు తగ్గనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.

🔆 ఈ ఏడాది సమ్మెటివ్‌ పరీక్ష ఒక్కటే ఉంటుంది. ఫార్మెటివ్‌లు రెండు ఉంటాయి.

🔆 ఇంటర్‌కు సంబంధించి ఇప్పటికే 30% పాఠ్యాంశాలను తగ్గించారు. రెండో ఏడాది ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండగా... మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

🔆 10 రోజులకోసారి విద్యార్థుల మార్పు

🔆 డిగ్రీ, ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది మినహా అన్నీ నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 🔆 ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది డిసెంబరు 1, డిగ్రీ తరగతులు అదే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.

🔆 ఉన్నత విద్యా సంస్థల్లో కొంత ఆన్‌లైన్‌, మరికొంత ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు.

🔆 కళశాల విద్యార్థులలో 1/3 వంతు చొప్పున విడతల వారీగా 10 రోజులపాటు తరగతుల్లో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత మొదటి బ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయి. మరో బ్యాచ్‌ 1/3 విద్యార్థులు తరగతులకు హాజరవుతారు.

🔆 మొత్తం ఒక సెమిస్టర్‌కు సంబంధించిన 90 రోజుల్లో 30 రోజులపాటు విద్యార్థులకు తరగతులు ఉంటాయి.

🔆 వసతి గృహాలను ఇదే విధానంలో కేటాయిస్తారు. తరగతులకు వచ్చిన వారికి వసతి గృహం సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులు విడతల వారీగా మారుతూ ఉంటారు.

🔆 వంద కిలోమీటర్ల కంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రం సెమిస్టర్‌ మొత్తం వసతి కల్పిస్తారు.

🔆 ఏదైనా తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు గ్రూపులుగా విభజిస్తారు.

🔆 సీట్ల ధ్య ఆరు అడుగుల దూరం ఉంటుంది

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top