Saturday 10 October 2020

ఉపాధ్యాయులకు శుభవార్త - బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్

 ఉపాధ్యాయులకు శుభవార్త - బదిలీలకు ముఖ్యమంత్రిగారు గ్రీన్ సిగ్నల్ 






🔥 ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలు పై  ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి.

 🔥 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న  ఉపాధ్యాయులకు బదిలీల అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.

🔥 కాగా, టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైల్‌ను సిద్ధం చేసిన విద్యాశాఖ.. ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో.. వెంటనే బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా ఈ బదిలీలు చేపట్టనున్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్‌లైన్లోనే నిర్వహించాలని భావిస్తోంది విద్యాశాఖ.. ఇక బదిలీలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ఖాళీల వివరాలతో పాటు ఇతర అంశాలను సేకరించి సిద్ధం చేసిపెట్టుకున్నారు జిల్లాల విద్యాశాఖాధికారులు.. హేతుబద్ధీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి, రాజీనామా, పదవీవిరమణలతో అయ్యే ఖాళీల జాబితాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top