Friday 28 August 2020

ఓహ్... బ్యాటరీ మాస్క్....?

ఓహ్... బ్యాటరీ మాస్క్....?





  కరోనా కాలంలో మాస్క్ వాడకం తప్పనిసరైన విషయం తెలిసిందే. మాస్క్ లేకుండా బయటకు కదలేని పరిస్థితి వచ్చింది. సరే... ఆ విషయం పక్కన పెడితే... ఇప్పుడు మాస్కుల్లో కూడా సాంకేతికత దూసుకువస్తోంది. అదెలాగంటే... దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ... ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా... ఎలక్ట్రానిక్ మాస్కులను అందుబాటులోకి తెచ్చింది.


    పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్‌లుగా వీటిని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వాడుతున్న సాధారణ మాస్క్‌లకన్నా ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక... ఈ మాస్క్‌ల్లోని ఫిల్టర్లను మన అవసరానకణుగుణంగా మార్చుకునే వెసులుబాటు ఉండడం వీటి ప్రత్యేకత.


    ఈ మాస్క్ల్‌ల్లో... బ్యాటరీ సాయంతో పనిచేసే రెండు ఫ్యాన్లు ఉంటాయి. ఈ ఫ్యాన్లు తిరిగే వేగాన్ని పెంచుకునే, లేదా తగ్గించుకునే  సౌలభ్యముండడం కూడా మరో విశేషం. పూర్తిగా ఛార్ఝింగ్ చేసిన తర్వాత... ‘లో మోడ్’లో... ఎనిమిది గంటలపాటు ఈ మాస్క్‌లను వాడుకోవచ్చు. ఏవైనా హానికరమైన క్రిములను తాకినపక్షంలో...అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావంతో అవి నిర్వీర్యమవుతాయి. కాగా... వీటి ధరతోపాటు ఇతరత్రా మరికొన్ని వివరాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top