Wednesday 26 August 2020

పింఛను దానం కాదు పదవీవిరమణ అనంతరం ఉద్యోగి గౌరవంగా బతికేందుకు ఇచ్చే సాయం - సుప్రీంకోర్టు వ్యా

 పింఛను దానం కాదు పదవీవిరమణ అనంతరం ఉద్యోగి గౌరవంగా బతికేందుకు ఇచ్చే సాయం - సుప్రీంకోర్టు వ్యాఖ్య





పింఛను దానం వంటిది కాదని.., పదవీవిరమణ అనంతరం ఉద్యోగి గౌరవంగా బతికేందుకు ఇచ్చే సాయమని  సుప్రీంకోర్టు పెర్కోంది.

    పింఛను దానంవంటిది కాదని, పదవీ విరమణ అనంతరం ఉద్యోగి గౌరవంగా బతికేందుకు ఇచ్చే సాయ మని బుధవారం సుప్రీంకోర్టు పేర్కొంది. తగిన కారణాలు లేకుండా, మరీ ముఖ్యంగా సాంకేతిక కారణాలు చూపి దాన్ని నిలుపుదల చేయకూడదని స్పష్టం చేసింది. 32 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి గత 13 ఏళ్లుగా పింఛను కోసం ఎదురు చూస్తున్న కేరళ ప్రభుత్వ ఉద్యోగి వి.సుకుమారన్ విషయంలో ఈ వ్యాఖ్య చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిస్తూ.. సుకుమారన్ తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిన కాలాన్ని కూడా పరిగణ నలోకి తీసుకోవాలని, మొత్తం బకాయిలను ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. సుకుమారన్ 1976లో మత్స్యశాఖలో తాత్కాలిక ఉద్యోగిగా చేరారు. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 1983లో రెవెన్యూ శాఖలో ఎల్‌డీసీ ఉద్యోగం పొందారు. అనంతరం మత్స్య శాఖకు బదిలీ చేయించుకొని 2008లో ఎల్‌డీసీగా పదవీ విరమణ చేశారు. తొలుత మత్స్యశాఖలో తాత్కాలిక ఉద్యోగిగా చేసిన ఏడేళ్ల కాలాన్ని పింఛను కోసం పరిగణ నలోకి తీసుకోవాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిం చింది. తాత్కాలిక ఉద్యోగాన్ని పింఛను కోసం పరిగణిం చరంటూ హైకోర్టు కూడా కొట్టివేసింది. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పడం లేదని, గౌరవంగా బతికేందుకు ఉదారంగా వ్యవహరించాలని సూచించింది. తాత్కాలిక ఉద్యోగిగా సుకుమారన్ పనిచేసిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని.. మొత్తం బకాయిలను 9 వారాల్లోగా చెల్లించాలంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top