Wednesday 29 July 2020

అన్‌లాక్‌ 3.0 : వీటికి అనుమతి - వీటికి అనుమతి లేదు



అన్‌లాక్‌ 3.0 : వీటికి అనుమతి - వీటికి అనుమతి లేదు












◾ కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్ల బయట కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నాయి.

వీటికి అనుమతి :


◾ లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగిస్తున్న రాత్రివేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

◾ జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది.

◾ భౌతిక దూరం పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.


వీటికి అనుమతి లేదు :


◾ స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలను ఇప్పుడే తెరిచేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఆగస్టు 31 వరకు వీటిపై ఉన్న నిషేధం యథాతథంగా అమలౌతుందని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

◾ మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు వంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది.

◾ సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టచేసింది

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top