Friday 24 April 2020

క్లస్టర్ రిసోర్సు పర్సన్ ( CRP ) మరియు MIS కో - ఆర్డినేటర్ జాబ్ చార్ట్స్




క్లస్టర్ రిసోర్సు పర్సన్ ( CRP ) మరియు MIS కో - ఆర్డినేటర్  జాబ్ చార్ట్స్







    విద్యాహక్కు చట్టం 2009ను సమగ్రంగా అమలు పర్చడానికి కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ని మార్గంగా ఎంచుకున్నది. చట్టంలో పేర్కొన్న పలు అంశాలు అమలు పరచడానికి, అమలులో ఎదురవుతున్న అదనపు పని భారాన్ని తొలగించడానికి సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం క్రింద 2012-13 నుండి స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్సు పర్సను (CRP), మండల రిసోర్సు సెంటర్ స్థాయిలో MIS కో-ఆర్డినేటర్ పోస్టులను మంజూరు చేయడం జరిగింది.  కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి 18 పాఠశాలలకు ఒక క్లస్టర్ రిసోర్సు పర్సనును నియమించవలసి ఉంది. 

    స్టేట్ ప్రాజెక్టు డైరెక్టరు, సర్వశిక్షా అభియాన్ వారు క్లస్టర్ రిసోర్సుపర్పనులు, MIS కో-ఆర్డినేటర్ జాబ్ చార్జులు వారి నియామక మార్గదర్శకాలలోనే పొందుపరచడం జరిగింది.  అలాగే సర్వశిక్షా అభియాన్, స్టేట్ ప్రాజెకక్టు డైరెక్టర్ ఉత్తర్వులు ఆర్ సి నం. 463/RVM(SSA) /C1/2012, తేది. 12.07.2012లో పేర్కొనడం జరిగింది. 

    ప్రత్యేకించి MIS కో-ఆర్డినేటరుల విధులు, బాధ్యతలు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టరు, రాజీవ్ విద్యామిషన్ ఉత్తర్వులు ఆర్ సి నం.766/A4/SSA/2013, తేది. 09.05.2013 ద్వారా తెలియజేయడం
    
క్లస్టర్ రిసోర్సు పర్సన్ (CRP) జాబ్ ఛార్ట్ :

పాఠశాల సముదాయం సమావేశ నిర్వహణలో కిందిఅంశాలలో పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులకు, అసిస్టెంట్ సెక్రటరీకి సహకరించడం.

• సమావేశ నిర్వహణ ఏర్పాటును చేయడం, సమావేశ అజెండాను అనుబంధ పాఠశాలలకు తెలపడం. సమావేశ మినిట్స్ ను సంబంధిత రిజిష్టరులో నమోదు, డాక్యుమెంటేషన్ నివేదికను రూపొందించడం. సమావేశానికి మాదిరి పాఠ్యాంశ ప్రదర్శనకు, ఇతర సెషన్లకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చడం.

• సమావేశంలో విషయ నిపుణుడిగా వ్యవహరించడం.

• సమావేశ నిర్వహణకు అవసరమైన మానవ వనరులను గుర్తించడం వారి సేవలను వినియోగించుకోవడం.

• ఉపాధ్యాయులకు ఒక విషయ నిపుణుడిగా సాయమందించడం,

• మాదిరి పాఠ్యాంశ ప్రదర్శనను ఇవ్వడం

• ఉపాధ్యాయులకు వృత్తిపరమైన సాయాన్ని అందించడం.

• వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కఠిన భావనలకు బోధనాభ్యసన సామగ్రిని రూపొందించడం. అన్ని సబ్జెక్టులలో ప్రశ్నా నిధులు, పరీక్షాంశాలను రూపొందించడం. ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న తరగతికి పూర్తిచేసిన సిలబస్ ప్రకారం సొంతంగా ప్రశ్నాపత్రాలను రూపొందించుకోవడంలో తగిన సాయం అందించడం.

• వృత్యంతర శిక్షణ కార్యక్రమాలలో విషయ నిపుణుడుగా వ్యవహ రించడం.

• పాఠశాలల్లో అమలులో ఉన్న వివిధ గుణాత్మక కార్యక్రమాలను మానిటరింగ్ చేయడం. + డేటాబేస్ నిర్వహణ.

• క్లస్టర్ పాఠశాలల నుండి డేటాను సేకరించడం, క్రోడీకరించడం.

• క్లస్టర్‌కు అనుసంధానం చేయబడిన ఆవాసప్రాంతాలలోని 6-14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరి సమాచారాన్ని సేకరించడం.

• క్లస్టర్ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న భౌతిక సదుపాయాలు, ఇంకా అవసరమున్న భౌతిక సదుపాయాలు మొదలగు వివరాలను సేకరించడం.

• ఉపాధ్యాయుల డేటా బేస్ భోదనోపకరణాలు - టివి, రేడియో, ఆరిసిసిపి, డివిడి ప్లేయర్, డిష్ అంటెన్నా, గణితం / సైన్స్ కిట్లు, ఛార్జులు, నమూనాలు,  మ్యాపులు, పాఠ్య పుస్తకాలు, కంప్యూటర్, ప్రయోగశాల పరికరాలుమొ॥ వాటిని నిర్వహించడం, వినియోగించడం.

• పాఠశాల సముదాయం గ్రంధాలయ నిర్వహణ - స్టాక్ రిజిస్టర్‌లో గ్రంధాలయ పుస్తకాలను నమోదు చేయడం. రిఫరెన్స్ పుస్తకాలను ఉపాధ్యాయులకు ఇవ్వడం, తిరిగి తీసుకోవడం. ఈ వివరాలను ఇష్యూ రిజిష్టర్ లో నమోదు చేయడం.

• గ్రంధాలయ పుస్తకాలు / మ్యాగజైన్లు సమకూర్చు కోవడంలో సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించడం.

• పాఠశాల సమూదాయానికి సంబంధించిన అన్ని రికార్డులను నిర్వహించడం. క్లస్టర్ స్థాయి ఎగ్జిబిషన్లు, మేళాలు మొదలగునవి నిర్వహించడంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులకు సహకరించడం

• బడిబయటి పిల్లల కొరకు ముఖ్యంగా పని నుండి విముక్తి పొందిన బాలకార్మికుల కోసం ఉద్దేశించబడిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడం. 

• పాఠశాల సముదాయ విధులలో - నమోదు, నిలకడ, సామర్థ్యాల సాధనలో నాణ్యతలలో ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని నమోదు చేయడంలో సహకరించడం.

• పాఠశాలల్లో నమోదు కాని, ద్రాపౌట్ అయిన పిల్లల చదువు గురించి 
కృషి చేయడంలో తన వంతు పాత్రను పోషించడం.

• పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు అకడమిక్ అంశానికిసంబంధించి అప్పగించే ఏ ఇతర పనినైనా నిర్వర్తించడం.
MIS కో-ఆర్డినేటరు జాబ్ చార్టు :

• మండల స్థాయి డైస్ మరియు ప్లానింగ్ తో సహా అన్ని రకముల సాంఖ్యక వివరాలు నిర్వహించడం.

• వెబ్ పోర్టల్ డేటా నిర్వహించడం.

• రాజీవ్ విద్యామిషన్‌కు సంబంధించిన అన్ని రకాల డేటా నిర్వహించడం.

• మండల పరిధిలోని పాఠశాలల్లోగల కంప్యూటర్ల స్థితిని పర్యవేక్షించడం .







CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top