Wednesday 25 March 2020

SWAYAM e-LEARNING PLATFORM ANDROID APP



SWAYAM e-LEARNING PLATFORM ANDROID APP










SWAYAM: ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా

 దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోయినా కేవలం చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఉచితంగా ఎన్ని కోర్సులైనా చేయొచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అందిస్తున్న కోర్సుల గురించి తెలుసుకోండి.

దేశమంతా 21 రోజుల లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 21 రోజులూ ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు ఏవైనా కొత్త కోర్సులు నేర్చుకోవచ్చు. ఇందుకోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లాంటి గ్యాడ్జెట్స్ ఉంటే చాలు... ఆన్‌లైన్‌లోనే కోర్సులు చేయొచ్చు. అది కూడా ఉచితంగా. ఆన్‌లైన్‌లో కోర్సులు అందించే ప్రైవేట్ సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ... కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది. అదే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టీవ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్-SWAYAM. దీన్నే స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అంటారు. పేరులో ఉన్నట్టుగానే విద్యార్థులు స్వయంగా ఇందులో కోర్సులు నేర్చుకోవచ్చు. విద్యార్థులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు టీచర్లు అందుబాటులో ఉంటారు. క్లాసెస్ కూడా అటెండ్ కావొచ్చు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ నడుస్తోంది. స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ ఉండటంతో విద్యార్థులు ఎప్పుడైనా ఇందులో కోర్సులు చేయొచ్చు. నచ్చింది నేర్చుకోవచ్చు. మేనేజ్‌మెంట్, న్యాయశాస్త్రం, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇలా అనేక అంశాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అందరూ ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. లెర్నింగ్ మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిపుణులు అందించే సెషన్స్‌కి అటెండ్ కావొచ్చు. ఆన్‌లైన్ కోర్సులు చేయొచ్చు. సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. విద్యార్థులకు కోర్సుల్ని అందించేందుకు 1,000 పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ కోసం పనిచేస్తున్నారు. కోటి మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 9 అత్యున్నత విద్యా సంస్థలు స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఎడ్యుకేషన్ కంటెంట్ అందిస్తున్నాయి. సొంతగా, ఇంటర్నేషనల్ కోర్సులు నేర్చుకోవడం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE, ఇంజనీరింగ్ సబ్జెక్టుల కోసం నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్- NPTEL, నాన్ టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC, అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ కోసం కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్-CEC, స్కూల్ ఎడ్యుకేషన్ కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్-NCERT, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్-NIOS, ఔట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU, మేనేజ్‌మెంట్ స్టడీస్ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-IIMB బెంగళూరు, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్-NITTTR కంపెంట్ అందిస్తున్నాయి

ఇన్ని కోర్సులు అందుబాటులో ఉన్న స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో మీరూ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే https://swayam.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు అప్‌కమింగ్ కోర్సులు, ఆన్‌గోయింగ్ కోర్సులకు సంబంధించిన వివరాలుంటాయి. అన్ని కోర్సులు 4 వారాల నుంచి 24 వారాల గడువుతో ఉంటాయి. మరి ఇప్పుడే స్వయం ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఖాళీ సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకోండి.









CLICK HERE TO INSTALL SWAYAM E LEARNING APP

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top