Saturday 21 December 2019

స్థానిక సంస్థల షెడ్యూల్ కు ముహూర్తం ఖరారు...? ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు...! 15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి ...!



ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు....  15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి ...






✔ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

✔ గత నెలలోనే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు సంకేతాలిచ్చారు.

✔ ఇప్పుడు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది.

✔ దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూలును వచ్చే జనవరి 9 లేదా 10 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది.

✔ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

✔ గరిష్టంగా 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలిసింది.

✔ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రులను ఆదేశించారు.

✔ పార్టీ గెలుపు బాధ్యతలను వారికే అప్పగించారు.

✔ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే తొలుత జనవరి 26న అమలు చేయాలని భావించిన అమ్మఒడి పధకాన్ని సైతం ముందుకు తీసుకొచ్చి..జనవరి 9న అమలు చేయాలని నిర్ణయించారు.

✔ ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

✔ ఈ లోగానే మార్కెట్ యార్డులు..దేవాలయ పాలకవర్గాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా..కొన్ని జిల్లాల్లో మార్కెట్ యార్డులను మాత్రం భర్తీ చేసారు.

✔ దేవాలయ పాలక వర్గాల మీద ఈ వారం రోజుల్లో నియామకాలు పూర్తి అవుతాయని మంత్రులు చెబుతున్నారు.

✔ ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసినప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం వీటికి సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయకుండా కాలయాపన చేసింది.

✔ దీంతో ఎన్నికలు సకాలంలో జరగలేదు. మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

✔ ఈ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించా లంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించింది.

✔ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

✔ గరిష్టంగా 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు

✔ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13,065 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 1.30 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలి.

✔ వీటిని మూడు, నాలుగు దశల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైతే ఒకటి లేదా రెండు విడతల్లో పూర్తయ్యే అవకాశముంది.

✔ అవి ముగియగానే పది పదిహేను రోజుల వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభించాలని అధికార వర్గాలు భావిస్తు న్నాయి.

✔ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాల వారీగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, సామగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది.

✔ దీని కోసం ఒకట్రెండు రోజుల్లో బ్యాలెట్‌ ముద్రణ టెండర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top