Monday, 4 November 2019

HALLTICKETS - AP RCET - 2019 (Research Common Entrance Test)



AP RCET - 2019
(Research Common Entrance Test)








ఏపీలోని యూనివర్సిటీలలో పీహెచ్‌డీ, ఎంఫిల్ ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2019 (ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-2019 పరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఏపీఆర్‌సెట్ పరీక్షలను ఈ ఏడాది నవంబరు 8 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 68 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల కోసం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడపతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...

➦ఏపీఆర్‌సెట్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.

➦ హోంపేజీలో కనిపించే “Download Hall Ticket” లింక్‌పై క్లిక్ చేయాలి.

➦ క్లిక్ చేయగానే హాల్‌టికెట్‌కు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.

➦ అక్కడ అభ్యర్థి తన ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదచేయాలి.

➦ నమోదు చేయగానే అభ్యర్థి హాల్‌టికెట్ కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది.

➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

➦ పరీక్షకు హాజరయ్యేవారు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.

హాల్‌‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్ళాల్సి ఉంటుంది.





CLICK HERE TO DOWNLOAD HALLTICKETS

0 comments:

Post a comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top