Friday 8 November 2019

పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులు ఎవరు...?



పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులు ఎవరు...?


      పిల్లల్ని గరాబంగా చూసుకోవడం మంచిదే కానీ అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది ఇది ముమ్మాటికీ నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరులుగా మారుస్తున్నారు...

ఇప్పుడు తరం పిల్లలు..
🔥  తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు.
🔥  వారి సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు..
🔥  లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు..
🔥  కనీసం లోదుస్తులు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు..
🔥  గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.
🔥  తిడితే వస్తువులను విసిరి కొడతారు

ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే ఫైవ్ స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, కొనుగోలు చేస్తున్నారు...

🔥  ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
🔥  ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
🔥  అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..
🔥  డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..
🔥  బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి
🔥  కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు వారిస్తే వెర్రి పనులు..

ఎందుకంటే మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు..
కానీ కారణం మనమే..
ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ నెస్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం...

గారభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది...

కష్టం గురించి తెలిసేలా పెంచండి అని.. కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..

ప్రేమతో, గరాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు...

అభినయాలు కనపడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు...

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ  చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, బాక్సు రైస్.
గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనాతీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..
10 దాటేలోపు సకల రోగాలు ఒంట్లోకి వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే తల్లిదండ్రులు మారాలి...

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?

ఒక్క సారి ఆలోచన చేయండి....

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి?

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో మసీదుకు వెళ్ళో పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు.

పిల్లలకు..👇

👉  బాధ్యత
👉  బరువు
👉  మర్యాద
👉  గౌరవం
👉  కష్టం
👉  నష్టం
👉  ఓర్పు
👉  సహనం
👉  దాతృత్వం
👉  ప్రేమ
👉  అనురాగం
👉  సహాయం
👉  సహకారం
👉  నాయకత్వం
👉  మానసిక ద్రృఢత్వం
👉  కుటుంబ బంధాలు
👉  అనుబంధాలు 
👉  దైవం
👉  దేశం

ఇవి సంప్రదాయాలు అంటే..

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక పిల్లలకు అలవాటు చేయాలి..
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

మనం కూడా మమేకమవుదాం....

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన ,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం...

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top