అయోధ్య తీర్పు: పాయింట్ టు పాయింట్
అయోధ్య కేసులో సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులదేనని తేల్చి చెప్పింది. అరగంటపాటు తీర్పు ప్రతిని జస్టిస్ రంజన్ గొగొయ్ చదవి వినిపించారు.
తీర్పులోని ముఖ్యాంశాలు మొదట్నుంచి..
🔹షియా వక్ఫ్‌బోర్డు దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ కొట్టివేస్తున్నాం.
🔹రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి.
🔹ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని ప్రార్థనామందిరాల చట్టం పరిరక్షిస్తుంది
ఇది వ్యక్తిగత హక్కులు కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు.
🔹మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పింది.
🔹పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నాం.
🔹రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది.
🔹వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు.
🔹మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయి.
🔹అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారు.
🔹రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు.
🔹రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయంలో వివాదం లేదు.
🔹ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారు.
🔹ముస్లింలు లోపల, హిందువులు బయట ప్రార్థనలు చేసేవారు.
🔹నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నాం.
🔹షియా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ తిరస్కరిస్తున్నాం.
🔹మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉండేది.
🔹వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోంది.
🔹మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదు.
🔹మొఘలులు సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది.
🔹శుక్రవారం నాడు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించింది.
🔹1856-57కు ముందు లోనికి వెళ్లే హక్కు హిందువులకు ఉండేది కాదు.
🔹ఆ సమయంలో పక్కనే ఉండే రామ్ఛబుత్రాలో హిందువులు పూజలు చేసేవారు.
🔹1949లో ఆ స్థలం హిందువుల అధీనంలోకి వచ్చింది.
🔹1949 తర్వాత ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్లు లేదా ప్రార్థనలు చేస్తున్నట్లు ముస్లింలు నిరూపించలేదు.
🔹వివాదాస్పద స్థలం కాకుండా మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి.
🔹అయోధ్యలోనే వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాలు కేటాయించాలి.
🔹అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందువులదే.
🔹ఆ స్థలంలో రామమందిరం నిర్మాణంపై విధివిధానాలకు ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి.
0 Post a Comment:
Post a Comment