Thursday, 14 November 2019ఇంగ్లీష్ భాష కావాలా?
ఇంగ్లీష్ మీడియం కావాలా?

-

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం లో ఎల్.కె.జి. నుండి 8వ తరగతి వరకు విద్యాబోధన అమ్మభాషలోనే వుండాలని నిర్దేశించింది. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 నుండి ప్రాథమిక విద్య ఇంగ్లీషు మీడియంలోనే వుంటుందని జీవో.నెం. 81 ద్వారా తెలియజేసింది. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు భాష నేర్చుకోవటానికి జనవిజ్ఞానవేదిక వ్యతిరేకం కాదు. కాని, సబ్జెక్ట్ ఇంగ్లీషు మీడియంలో చెప్పటానికి వ్యతిరేకం. ఇంగ్లీషు భాష మన పిల్లలకు చాలా చాలా అవసరం. ఇంగ్లీషు భాష చదవడం, వ్రాయటం, మాట్లాడటం నేర్పించాలి. ఇంగ్లీషు భాష గా నేర్చుకోవడానికి, ఇంగ్లీషును బోధనా భాషగా చేయటానికి చాలా తేడా వుంది. భాషను, భాషగా నేర్పించితే భాష వస్తుంది. కాని, భాషను
సబ్జెక్ట్ గా చేర్చించితే భాష రాదు.

ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో పరీక్షలు మాత్రం బట్టి పట్టి ఇంగ్లీష్ భాషలో వ్రాస్తున్నారు. కానీ సబై లోని సారాంశం మాత్రం అమ్మ భాషలోనే వివరించటం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. ఆఖరుకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో పాఠ్యాంశాలను కూడా అమ్మభాషలోనే చెప్పటం జరుగుతుంది. దీనిని బట్టి అమ్మభాషలో చెప్పటం వలనే పిల్లలకు సబ్జెక్ట్ లో సారాంశం అర్థం అవుతున్నదని తెలుస్తున్నది. పరాయి భాషలో చెపుతున్నప్పుడు 95% విద్యార్థులు కాసురూంలో డల్ గా ఉంటున్నారు. దీనికి కారణం విషయం అర్థం కాకపోవడం వల్లనే ఇటీవల కొందరు విద్యావేత్తలు 10వ తరగతి చదివే తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సజక్టుల విషయ పరిజ్ఞానాన్ని పోల్చి చూసారు. గ్రూపు సబ్జెక్స పట్ల అవగాహన వున్నవారిలో 100కి 80 మంది తెలుగు మీడియం వారు కాగా, కేవలం 20 మంది మాత్రమే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అని తేలింది. కారణం విద్యార్థులు ఆలోచించడం
అమ్మభాషతోనే నేర్చుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులకు ఇంగ్లీష్ భాష బాగా వంటబడుతుందనే భ్రమ చాలా మందికి వుంది. ఆ మీడియంలో చదువుతున్న పిల్లలతో మాట్లాడితే పిల్లలకు ఆ భాష ఎంత వచ్చో మనకు ఆ రం అవుతుంది. ఇలాంటి విద్యావిధానంలో విద్యార్థులకు ఆంగ్లభాష రాకపోగా సోషల్, సైన్స్, గణితం మొ॥ సబ్జెక్టులు పట్టుపడక ఉభయ భ్రష్ఠుత్వం పొందుతారు.
అయితే తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం సూళ్ళ పట్ల ఎందుకు మక్కువ చూపుతున్నారు?

1. తమ పిల్లలు తమ కంటే బాగా చదివి ఉన్నత స్థితికి రావాలని, ఆ స్థితికి రావాలంటే తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనే భ్రమలో, పాలకులు, కార్పోరేటు సంస్థలు తల్లిదండ్రులను మబ్బులో ఉంచుతున్నారు.

2.మా పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాం. మీ పిల్లలను తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? అని చులకనగా చూస్తారని భయం.

3. ఇంగ్లీష్ మాట్లాడటం చేతకాక, తమ పిల్లలు మిగతా పిల్లల ముందు తేలికయిపోతారనే బిడియం. అందుకే ఇంగ్లీష్ భాష నేర్పించితే ఈ సమస్య రాదు.

ఇంగ్లీష్ మీడియాలో చదివితేనే ఉద్యోగ అవకాశాలు వుంటాయనే భ్రమ. కానీ ఇంగ్లీషు భాష వస్తే దేశ,విదేశాలలో ట్రాన్స్లేషన్, ఇంటర్ ప్రిటేషన్, టీచింగ్, రీసర్చ్ మొదలగు అనేక రంగాలలో ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. ఉద్యోగావకాశాలు ఎట్టిపరిస్థితులలోను పిల్లలు చదివే మీడియం ఫై ఆధారపడి వుండవు. సబైకులలోని సారాంశం పిల్లలకు ఏమేరకు అర్థం అయిందని దాని మీద ఆధారపడి వుంటుంది. ప్రధానంగా ఉద్యోగావకాశాలనేవి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య మన పూర్వీకులు సరిహద్దు లను దాటి అనేక దేశాలతో వాణిజ్యం చేయడమే కాక, అక్కడ పనులు కూడా చేశారు. విదేశీ భాషలను నేర్చుకోకుండా ఇది సాధ్యమయ్యే పనికాదు.

మన దేశంలో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారు ఎంతమంది ఇంగ్లీష్ భాష మాట్లాడగలుగుతున్నారు,
వ్రాయగలుగుతున్నారు. సంపన్న వర్గాలకు చెందిన బహుకొద్దికి (5%) మాత్రమే వారి కుటుంబ నేపథ్యం దృష్ట్యా ఇది సాధ్యమవుతున్నది. అమ్మ భాష మీద పట్టులేకుండా, పరాయి భాష నేర్చుకోవడం కష్టమని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణుల అభిప్రాయం. ఇంగ్లీషు మీడియంలో బోధన వలన గ్రామీణ, హరిజన, గిరిజన, బడుగు మైనార్టీ వరాల పిల్లలకు ఏ భాష మీద పట్టు దొరకక "రెండింటికీ చెడ్డ రేవడి" అవుతారు. కనుక విద్యార్థులకు ఇంగ్లీషు భాష నేర్పించండి. ఇంగ్లీషు మీడియంలో బోధన కాదు.

 పాఠ్యాంశాలను తెలిసిన భాషద్వారా (అమ్మభాష ద్వారా) నేర్చుకోవడం చాలా తేలిక. ఎంతో సమయం
ఆదా అవుతుంది. “ఒక బిడ్డ అమ్మభాషలో ఒక్క సంవత్సంలో నేర్చుకున్న విద్య పరాయి భాషలో నేర్చుకోవటానికి నాలుగేళ్ళు పడుతుందని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది అక్షరాలా అక్షర సత్యం. తెలియని భాషలో, తెలియని సబ్జెక్ట్ నేర్చుకోవటంవల్ల, అమూల్యమైన కాలం పృధు అవుతుంది. బాల్యంపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు మానసికంగా అలసిపోతారు. ఈ భోదనవల్ల, విద్యార్థులు, ప్రతి విషయాన్ని కంఠస్తం చేయవలసి వస్తుంది. బట్టి పెట్టే అలవాటు పెరిగి, విషయం అవగాహణ తిరిగి పోతుంది. ఆచరణలో స్వేచ్చగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించలేని "వైకల్యం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం లేని వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. భావాన్ని సరిగా అర్థం చేసుకోలేరు కనుక సృజనాత్మక శక్తిని (Creativity) కోల్పోతారు. డ్రాప్అవుట్స్ ఎక్కువగా వుంటాయి. తద్వారా వ్యక్తిగత అభివృద్ధి కుంటుపడుతుంది నాలుగైదేళ్ళ వయస్సు వరకు పిల్లలు చదవడం కన్నా వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ, బంధుమిత్రుల సంభాషణల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. శిశు విద్య పర భాష లో ఉంటే, పాఠశాలలో నేర్చుకునే దానికి, ఇంటి దగ్గర వివిధ సంభాషణలు ద్వారా నేర్చుకునే దానికి పొంతన ఉండదు.

   అమ్మ భాష లో పదజాలం (Vocabulary) పిల్లవాడు ఆటోమేటిక్ గా కష్టపడకుండా నేర్చుకుంటాడు. ఎందువలన....?

సబ్జెక్స్ అమ్మభాషలో ఉంటే, సబ్జెక్టు లోని సారాంశం, కష్టపడకుండా (Stress) లేకుండా సునాయాసంగా
అర్ధంచేసుకుంటాడు. అమ్మభాషలో విద్యాభోదన పొందిన విద్యార్థి అమ్మపాలతో పుష్టిగా పెరిగిన బిడ్డ లాంటి వాడు. పరభాషలో విద్యాభోదన పోతపాలతో పెరిగిన ఈసురోమంటూ ఉండిన బిడ్డ లాంటి వాడు. నేటి చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల ప్రజలు, LKG నుండి PG వరకు, Research తో సహా, అమ్మభాషలో నేర్చుకొని, అభివృద్ధి చెందటం మనం కళ్ళారా చూస్తున్నాం. కాని మనం మాత్రం ప్రాథమిక విద్యను కూడ, పరభాషలో బోధించాల్సిందేనని పట్టుబడుతున్నాం. దేనిని మహోన్నత ప్రపంచ భాషగా మనమిలా వ్యామోహం పెంచుకుంటున్నామో ఆ ఇంగ్లీషు భాష 15వ శతాబ్దానికి ముందు, ఇంగ్లాండు లోనే బోధనా భాషగా లేదు.

ఇపుడు తెలుగులో బోధిస్తే స్కూలుకు పోయి మనం అడ్డుకున్నట్లే, ఆనాడు ఆంగ్లేయులు కూడా, ఫ్రెంచి, గ్రీకు, లాటిన్ వంటి పరాయి భాష వ్యామోహంలో మునిగి, అమ్మ భాష అయిన ఇంగ్లీషు బోధించే పాఠశాలను ఉపాధ్యయులను గేళిచేసారు, అందుకున్నారు. ఆ తరువాత చాసర్, మిల్టన్ లాంటి కవుల కృషిఫలితంగా, ప్రొటెస్టంట్ మత నిరసన ద్వారా, ఆంగ్లేయులు, తమ దేశం పై ఫ్రెంచి, గ్రీకు, లాటిన్ భాషల పెత్తనాన్ని తొలగించుకున్నారు. ఆతర్వాతనే, ఇంగ్లీషు బోధనా భాష అయింది. అప్పటి నుండే, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, పారిశ్రామికాది సమస్త రంగాలలో ఆ దేశం అగ్రగామి అయింది. సృజనాత్మకతకు పట్టుకొమ్మ అయింది.

Shakespeare కాలం నాటికి ఇంగ్లీషు పదజాలం మొత్తం కేవలం 24వేల పదాలు మాత్రమే. కాని, ప్రపచంలోని అనేక భాషలు ని పదాలు, తనలో కలుపుకుని, ఈ నాటికి 10 లక్షల పదజాలానికి చేరుకొని ఇంగ్లీషు ప్రపంచ భాష గా మారింది. భారత దేశం నుండి "జయహో" అనే పదాన్ని 10వ లక్ష పదంగా ఇంగ్లీషు డిక్షనరీలో చేర్చారు. అలాగే ప్రపంచంలో ఏ భాషలో ఉన్న పదాన్నయినా, తెలుగు పదంగా మార్చుకునే శక్తి ఒక తెలుగు భాషకు మాత్రమే ఉందని చెప్పటానికి జనవిజ్ఞాన వేదిక గర్వపడుతుంది. "డుమువులు" ప్రథమా విభక్తి, నిన్, లన్, గూర్చి తృతియా విభక్తి. అని మనం చిన్నపుడు నేర్చుకున్నాం. ఈ సూత్రాన్ని ఉపయోగించి ప్రపంచ భాషల పదాలను తెలుగు పదాలుగా మార్చవచ్చు. తెలుగు భాష ను ప్రపంచ భాషగా తీర్చి దిద్దవచ్చు.

 ఉదా:-

Glass అనేది ఇంగ్లీషు పదం మనం
పానీయం త్రాగు పాత్ర అని చెప్పనక్కర్లేదు. గ్లాస్ + ఉ (కారం) - గ్లాస్ తెలుగు పదం.

Road అనేది ఇంగ్లీషు పదం.
మనం రహదారి అని చెప్పనక్కర్లేదు. రోడ్ + ఉ (కారం) = రోడ్డు తెలుగు పదం.

శ్రీ పరవస్తు చిన్నయ్యసూరి మన తెలుగు భాషకు ఇచ్చిన మహత్తర గొలుసు ఈ ప్రయోగం. దీనిని ఉపయోగించి తెలుగు ప్రపంచ భాషగా మారుద్దాం. పరభాషలో ప్రాధమిక విద్య కొనసాగినంత కాలం మట్టిలోని మాణిక్యాలు మట్టిలోనే ఉంటాయి. వెలుగులోకి రావు. ఇది నగ్నసత్యం. మేము సాగించే అమ్మ భాషా ఉద్యమానికి, తొడ్పడంది. పిల్లల భవిష్యత్తు ను కాపాడండి.


Regd. No. 1276/88 AIPSN అనుబంధం
జనవిజ్ఞాన వేదిక
- విజయవాడ నగర కమిటీ

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top