Monday 4 June 2018

RIGHT TO INFORMATION ACT - 2005 ( సమాచార హక్కు చట్టం - 2005 సమగ్ర వివరాలు )





RIGHT TO INFORMATION ACT - 2005

సమాచార హక్కు  చట్టం - 2005  సమగ్ర వివరాలు



 సమాచార హక్కు చట్టం అంటే.....సహ చట్టం సెక్షన్ 2(జే)ప్రకారం పాలనలో పారదర్శకత ,జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రభుత్వ  యంత్రాంగం అదుపులో వున్న సమాచారాన్ని పౌరులు పొందడం. www.teachersneed.info



 సమాచారం అంటే....ప్రభుత్వ కార్యాలయాల్లోని సహ చట్టం,సెక్షన్ 2(ఎఫ్)మేరకు  రికార్డులు,పత్రాలు,మేమోలు,ఈమైల్,అబిప్రాయాలు,ఆదేశాలు,ఒప్పందాలు,పత్రిక ప్రకటనలు,ఒప్పందాలు,కాంట్రాక్టులు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, నమూనాలు, సలహాలు, కమ్ప్యూటర్లలో నిక్షిప్తం అయీన డేటా,సీడీ,డీవీడీ,ప్లాపి,మరే ఇతర రూపంలో వున్న సమాచారం.




 సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 5(1)మేరకు ప్రజా సమాచార  అధికారి/సహాయ ప్రజా సమాచార అదికారి వుంటారు.సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలి.అతనికి మనకు కావాల్సిన సమాచారాన్ని దరఖాస్తు సమాచారాన్ని దరఖా చేసుకొని పొందవచ్చు.



 సహ చట్టం మేరకు దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు.తెల్లకాగితంపై సమాచారం కోసం విన్నపం అని వ్రాసి ఇస్తే చాలు.



 దరఖాస్తు రుసుము...గ్రామస్థాయి సంస్థలకు ఉచితం , మండలస్థాయిలో :5/-రూ , జిల్లా,రాష్ట్ర,కేంద్ర స్థాయి సంస్థలకు :10/రూ:చెల్లించాలి.



 దరఖాస్తు రుసుము జీ.ఓ.ఎంఎస్.నెం:740,సహ చట్టం,సెక్షన్7(3)మేరకు నగదు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్, బ్యాంకు చెక్కు, డి.డి, ఛలాన, రూపంలో చెల్లించవచ్చు.



 దరఖాస్తు రుసుం సహ చట్టం,సెక్షన్ 7(5)మేరకు దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి ఉచితం.రేషన్ కార్డు వున్న వారికి వర్తిస్తుంది. www.teachersneed.info



 సహ చట్టం,సెక్షన్ 6(2)ప్రకారం కోరుతున్న సమాచారం ఎందుకని దరఖాస్తు అడిగే అధికారం ఏ అధికారికి లేదు.


 సహ చట్టం-2005,సెక్షన్ 7(1)మేరకు 30రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి.అయితే వ్యక్తి స్వేచ్ఛ,జీవించే హక్కులకు భంగం కలిగే సందర్భంలో 48గంటల్లో ఇవ్వాలి.



 సమాచారం ఇవ్వకుంటే....సహ చట్టం,సెక్షన్19(1)మేరకు ప్రభుత్వ కార్యాలయం యొక్క వున్నత అదికారికి మొదటి అప్పీలు చేయాలి.30-45రోజుల్లో సమాచారం ఇవ్వాలి.



 అప్పటికి సమాచారం రాకుంటే.....90రోజుల వ్యవధిలో రాష్ట సమాచార కమీషన్కు,సెక్షన్ 19(3)మేరకు అప్పీలు చేయాలి:గడువు సహ కమిషన్ నిర్దేశిస్తుంది.



  దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించిన, ఎక్కువ దరఖాస్తు రుసుం కోరిన, తెలిసి అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చిన, సమాచారం నిరాకరించడం, కోరిన సమాచారాన్ని ద్వంసం  చేయడం, సమాచారం ఇవ్వడాన్ని అడ్డుకోవడం ఇవ్వన్నీ నేరాలే వీటికి పాల్పడిన ప్రజా సమాచార అధికారికి సహ చట్టం,సెక్షన్ 20(1)మేరకు రోజుకు 250నుండి 25,000వేల వరకు జరిమానా విధించే అధికారం సహ కమీషన్కు వున్నది.తరచూ సహ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అదికారులకు సెక్షన్20(2)మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు.



  సహ చట్టం,సెక్షన్ 7(6)మేరకు 30రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి. www.teachersneed.info



  సహ చట్టం,సెక్షన్ 4(1)(బి)మేరకు ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విధులు, భాద్యతలు,ఋవిధినిర్వహనలో పాటించే సూత్రాలు, జవాబుదారీతనం, పారదర్శకతకు వున్న మార్గాలు, ఉద్యోగులు వివరాలు , వారి నెలవారి జీత భత్యాలు, బడ్జెట్ కేటాయింపు, రికార్డుల పట్టికలు, రాయితీల వివరాలు, పీఐఓల వివరాలు, సలహా సంఘాలు తదితర వాటికి సంబందించిన 17 అంశాల సమాచారం ఎవరూ అడుగక ముందే స్వచ్ఛందంగా వెల్లడించాలి.



 సహ చట్టం,సెక్షన్ 4(1)(సి)మేరకు ముఖ్యమైన విధానాలు రూపొందించేటపుడు,ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలు ప్రకటించేటపుడు వాటికి సంబందించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.అంటే కొత్త చట్టాలు తెచ్చే ముందు,ఉన్నవాటికి సవరణలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.



 రికార్డుల తనిఖీ చేసే అదికారం ఎవరికైనా ఉంది. దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల్లోన్ని అన్ని రికార్డులను, చేపడుతున్న అభివృధి కార్యక్రమాలను అధికారుల సమక్షంలో పరిశీలించవచ్చు. (నిర్మాణ పనులు, ప్రజా సంక్షేమ పధకాల అమలు) కావలసిన రికార్డులను సహ చట్టం,సెక్షన్ 2(జె)(1)మేరకు తనిఖీ చేయవచ్చు.&సహ చట్టం,సెక్షన్ 2(జె)(2)మేరకు నకలు, ఫోటో, వీడియో పొందవచ్చు , అయితే సమాచార ప్రతిపై పిఐఓ ధ్రువికరించి ఇవ్వాలి.

 సమాచారం పొందుటకు చెల్లించాల్సిన రుసుములు వివరాలు....జీ.ఓ ఎం.ఎస్.నం:454మేరకు A3/A4 కాగితానికి-----2/-రూ.., ప్లాపికి ----50/-రూ., సీడీ కి ----100/-రూ., డి వి డి కి ----200/-రూ. www.teachersneed.info



 సహ చట్టం,సెక్షన్ 8 మేరకు దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లె, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే, పొరుగు దేశాలతో మైత్రి చెడిపోయే, చట్ట సభల హక్కులకు భంగం కల్గే సందర్భలలో ఈ చట్టం వర్తించదు.



 సహ చట్టం,సెక్షన్ 24 మేరకు దేశ భద్రత,నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్ బ్యూరో, రెవెన్యూ  ఇంటెలిజెన్స్, రా(క్యాభినేట్ సెక్రటేరియట్ రీసెర్చ్&అనాలసిస్ వింగ్), కేంద్ర రిజర్వు పోలీస్ దళం, సరిహద్దు భద్రత బలగం, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం, జాతీయ రక్షక దళం, ఇండియన్-టిబెట్ సరిహద్దు బలగం, అస్సాం రైపిల్ ఫోర్స్, ఏన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్, సిఐడి-అండమాన్ నికోబార్, స్పెషల్ బ్రాంచ్ సిఐడి-లక్యదీప్, ఏరోనాటికల్స్ రీసెర్చ్ కేంద్రం లాంటిికి మినహాయింపు  వుంది.అయీతే ఇందులో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనకు సంబందించిన  సమాచారం తీసుకోవచ్చు. www.teachersneed.info



 సహ చట్టం,సెక్షన్6(3)మేరకు దరకాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు(కార్యాలయానికి)చెందినది కానట్టు ఐతే సదరు పిఐఓ సంబంధిత సంస్ధకు  పంపాలి. దరఖాస్తు అందిన "5" రోజుల్లోపు పంపి విషయం దరఖాస్తుదారుడికి చెప్పాలి.



 సహ చట్టం, సెక్షన్2(h)మేరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ  కార్యాలయాలు&సెక్షన్ 2(h)(2)ప్రకారం ప్రభుత్వాల నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా, నిధులు, రాయితీలు, భూకేటాయింపులు పొందిన ప్రయీవేటుసంస్థలు కూడా అదికార యంత్రాంగాల క్రిందకు వస్తాయి.



 సహ చట్టం,సెక్షన్ 7(9)మేరకు ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చైయ్యే, రికార్డు భద్రత ప్రమాదంలో పడుతున్న సంధర్భంలో తప్ప  కోరిన రూపంలో సమాచారం ఇవ్వాలి.



 సహ చట్టం,సెక్షన్ 21ప్రకారం ,ఈ చట్టం క్రింద రూపొందిన నిబంధనల మేరకు మంచి చేస్తున్నామని నమ్మకంతో ఎవరు ఏమి చేసిన, వారిపై ఎటువంటి ధావాలు వేయడం, న్యాయవిచారణ చేయడం, చట్టపరమైన చర్యకు తీసుకోవడం కుదరదు.



 సహ చట్టం, సెక్షన్ 23మేరకు కమిషన్ జారీచేసిన ఆదేశాలపై దావాను వేయడం, ఇతర విచారణను ఏ న్యాయస్థానం  చేపట్టకూడదు.ప్రశ్నించకూడదు.



 సహ చట్టం తాలూకా ప్రయోజనాలను ప్రజలకు అందించి వారిలో అవగాహన కల్పించే భాద్యత సహ చట్టం సెక్షన్ 26 మేరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధి.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top