Sunday 27 May 2018

సెలవులు - సద్వినియోగం ( Leaves and it's usage )




Leaves and it's usage

సెలవులు - సద్వినియోగం


ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో పాటు అదనంగా పలు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. విధులలో ఉన్నవారే కాకుండా పదవీ విరణమణ చేసి ఉద్యోగులు సైతం వీటిని విని యోగించుకునే అవకాశముంది. అయితే రెగ్యులర్‌ ఉద్యోగులకు, ఎయిడెడ్‌ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు స్వల్ప తేడాతో ఈసౌకర్యాలున్నాయి. పండుగలకు అడ్వాన్స్‌లు పిల్లలకు విద్యా అలవెన్స్‌లు, మరణిస్తే ఆర్ధికసహాయం, వంటివి ప్రభుత్వం కల్పిస్తుంది. వేతనానికి వేతనం ఇతర సౌకర్యాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు వీటిపై సరైన అవగాహనలేక వినియోగించుకోలే కపోతున్నారు. 






ప్రసూతి సెలవులు : మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చే నిమిత్తం 2010లో మంజూరు చేసి న జి.ఓ నెంబర్‌ 152 ప్రకారం 180 రోజుల సెలవులు డెలివరీ సమయంలో వాడుకోవచ్చు. ఈసెలవు లు వేతనంతో కూడుకున్నవి.


క్యాజువల్‌ సెలవులు : ఉద్యోగులకు సంవత్సరానికి 15 రోజులు సాధరాణ సెలవులు మంజూరు చేస్తా రు. 1981లో జీఓ నెంబర్‌ 52 మంజూరుచేసింది. 


ఐచ్చికసెలవులు : ప్రభుత్వ ఉద్యోగులకు క్యాలెండర్‌ ఇయర్‌కు ఐదురోజులు ఐశ్చిక సెలవులు మంజూరు చేస్తారు. అయితే క్యాలెండర్‌లో పేర్కొన్న పండుగలలో మాత్రమే ఈసెలవులు ఉపయోగించుకునే వీలుంటుంది. ఇవికూడా వేతనంతో  కూడుకున్నవే. 

అర్థవేతన సెలవులు : అర్ధ వేతన సెలవులు కింద ప్రభుత్వం 1994లో మంజూరుచేసిన 317 జీ.ఓ కింద ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 20 అర్ధ వేతనపు సెలవులు మంజూరుచేస్తారు. వీటిని వాడుకున్న ఉద్యోగులకు ఆయా రోజులలో సగం వేతనం చెల్లిస్తారు. 

పితృత్వ సెలవులు: 2015లో ప్రభుత్వం మంజూరుచేసిన 231 జీ.ఓ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు కింద 15 రోజులు మంజూరుచేశారు. ప్రసవం పొందిన భార్యకు సేవలందించేందుకు భర్తకు ఈసెలవులు ఇస్తారు. 

సంపాదిత సెలవులు(ఎర్న్‌డ్‌లీవ్స్‌): క్యాలెండర్‌ ఇయర్‌కుగాను 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు. ఈసెలవులు వాడుకోగా మిగిలిన వాటిని అదే ఏడాది అమ్ముకోవచ్చు.అంటే ఆమొత్తానికి సమానమైన వేతనాన్ని పొందవచ్చు. 1994లో ప్రభుత్వం 317 జీ.ఓను మంజూరుచేసింది. 

కుటుంబ నియంత్రణ సెలవులు: కుటుంబ నియంత్రణ చేసుకున్న పురుష ఉద్యోగులకు ప్రభుత్వం ఆరు రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరుచేస్తారు. మహిళా ఉద్యోగులకు మాత్రం 14 రోజులు మంజూరుచేస్తారు. వీటిని మంజూరుచేస్తూ  1968లో జీ.ఓ నెంబర్‌ 1415ను విడుదలచేసింది. 

అబార్షన్‌ సెలవులు: అబార్షన్‌ సెలవులు కింద ప్రభుత్వం 1976లో జీ.ఓ నెంబర్‌ 762ను విడుదల చేసింది. దీనిప్రకారం అబార్షన్‌ సెలవులు కింద మహిళా ఉద్యోగులు 42 రోజులు సెలువులు ప్రభుత్వం మంజూరుచేస్తుంది. 

చైల్డ్‌ కేర్‌ లీవ్‌: ప్రభుత్వం చైల్డ్‌ కేర్‌ లీవ్‌ కింద 2016లో జీ.ఓ నెంబర్‌ 132 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగు లకు 60 రోజులు సెలవులు మంజూరుచేస్తుంది. 

రీకానలైజేషన్‌ సెలవులు: 1981లో జీ.ఓ నెంబర్‌ 102 ప్రకారం రీకానలైజేషన్‌ కింద 21 రోజుల సెల వులు మంజూరు చేస్తారు. 

రక్తదాన సెలవు: ఉద్యోగులకు రక్తదాన సెలవు కింద ఒక్కరోజు మంజూరు చేస్తారు. 1984లో జీ.ఓ నెంబర్‌ 137ను ప్రభుత్వం జాచేసింది. 

యూనియన్‌ లీడర్స్‌ స్పెషల్‌ సెలవులు: ప్రభుత్వరంగ సంస్థలలో యూనియన్‌ నాయకులుగా పనిచేస్తు న్న ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ కింద 21 రోజులు మంజారుచేస్తూ 1994లో జీ.ఓ నెంబర్‌ 470 విడుదలచేసింది. 

హిస్టరెక్టమి సెలవులు: 2011లో హిస్టరెసక్టమి సెలవులు 45 రోజులు మంజూరుచేస్తూ జీ.ఓ నెంబర్‌ 52ను విడుదల చేసింది.


ఇవేకాకుండా ఇతర సౌకర్యాలు కూడా ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తుంది. 


ఇద్దరు పిల్లలకు ఇంటర్‌ వరకు ప్రతి సంవత్సరం ఫీజురియంబర్స్‌మెంట్‌ కింద రూ.2,500 ప్రభుత్వం అందజేస్తుంది. 

పండుగ అడ్వాన్స్‌కింద నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రూ.7,500 వడ్డీలేని రుణం అందజేస్తుంది. ఈమొత్తాన్ని పది వాయిదాలలో చెల్లించాల్సివుంటుంది.

మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగుల పిల్లలకు అవకాశం కల్పిస్తుంది. 

సర్వీస్‌లో ఉండి చనిపోయిన ఉద్యోగుల అంత్యక్రియలకోసం రూ.25 వేలు చెల్లిస్తారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియలకు రూ. 10వేలు మంజూరుచేస్తారు. 

పి.హెచ్‌.సి అలవెన్స్‌, బేసిక్‌పై 10 శాతం లేదా రూ. రెండువేలు మంజూరు చేస్తారు. అర్బన్‌ ఉపాధ్యాయులకు రీడర్‌ అలవెన్స్‌ మంజూరు చేస్తారు. 


ఉద్యోగులకు అర్భన్‌, రూరల్‌ పరిధిని పరిగణలోకి తీసుకొని హెచ్‌.ఆర్‌ చెల్లిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top