Thursday 26 April 2018

PAY REVISION COMMITTEE (PRC) Functions and procedures



PAY REVISION COMMITTEE (PRC) Functions and procedures


ప్రతి ఐదేళ్లకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతుంది. పీఆర్‌సీ సమయంలో ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ , ప్రారంభ డీఏ, నోషన్‌ ఫిక్సేషన్‌ తదితర అంశాలు ఉంటాయి.


పీఆర్సీ :

పీఆర్‌సీని ఆంగ్లంలో పే రివిజన్‌ కమిటీ (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్‌ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేత నాలుగా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్‌ స్కేలు, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయం గా తాజా మూల వేతానాలను ప్రతిపాదిస్తుంది.


మధ్యంతర భృతి(ఐఆర్‌) :

ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ రద్దవుతుంది.


ఫిట్‌మెంట్‌ :

తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితిశాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్‌ అంటారు.


మాస్టర్‌ స్కేల్‌ :

మూత వేతనాల శ్రేణినే మాస్టర్‌ స్కేల్‌ అంటారు. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారు. కొత్త మూల వేతనాలు, మాస్టర్‌ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు. మాస్టర్‌ స్కేల్‌లో మూల వేతనాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్‌ విలువలు పొందు పరుస్తారు. వేతన స్థిరీకరణలను మాస్టర్‌ స్కేల్‌ ప్రకారం జరుపుతారు.


నోషనల్‌ ఫిక్సేషన్‌ :

పీఆర్‌సీ అమలైన తేదీ నుంచి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నోషనల్‌ పిరియడ్‌ అంటారు. ఈ పీరియడ్‌లో జరిగే స్థిరీకరణనే నోషనల్‌ ఫిక్సేషన్‌ అంటారు. ప్రభుత్వం పీఆర్‌సీని సకాలంలో జరపకపోవడం వల్ల నోషనల్‌ పిరియడ్‌ వస్తుంది. నోషనల్‌ కాలంలో పెరిగిన వేతనాలను ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాడ్యూటీ, పెరిగిన మూల వేతనాలకు చెల్లించరు. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు.


నైష్పత్తిక డీఏ :

ప్రతీ పీఆర్‌సీలో డీఏ విలువను మార్పు చేస్తారు. కేంద్రం ప్రకటించే ప్రతి ఒక్క శాతం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏను నైష్పత్తిక డీఏ అంటారు.








0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top